Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:36 PM

అఖిలభారత ఐక్య రైతు సంఘం మహాసభల విజయవంతానికి పిండిప్రోలులో ఉదృత ప్రచారం

అఖిలభారత ఐక్య రైతు సంఘం మహాసభల విజయవంతానికి పిండిప్రోలులో ఉదృత ప్రచారం

అఖిలభారత ఐక్య రైతు సంఘం మహాసభల విజయవంతానికి పిండిప్రోలులో ఉదృత ప్రచారం
May 05, 2026 02:50 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మే 11, 12, 13 తేదీలలో జరగనున్న అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు ప్రజల కడుపు నింపుతూ తానే కష్టాల్లో మగ్గుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనం నాటిన దగ్గర నుండి పంటను మార్కెట్లో అమ్మే వరకు రైతు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడని పేర్కొన్నారు.


అతివృష్టి, అనావృష్టి సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు రైతులకు భారంగా మారుతున్నాయని విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కల్తీ, కూలీల కొరత, మార్కెట్లో దళారీల బెడద వంటి అనేక సమస్యలు రైతును ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్ శక్తులు వ్యవసాయ రంగంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.


మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, పంటలకు గిట్టుబాటు ధరపై చట్టం చేయలేదని అన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులపై సబ్సిడీలు తగ్గించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్యాంకులు సరైన రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని మోసపోతున్నారని తెలిపారు. కౌలు రైతుల సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని అన్నారు.


ఇల్లందులో జరిగే మహాసభల్లో రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు సుమారు 25 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, రెండవ రోజు 16 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నట్లు వివరించారు.


ఈ మహాసభలకు రైతు నాయకులు వడ్డే శోభనాదీశ్వరరావు, ప్రదీప్ సింగ్ ఠాకూర్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు, అరుణక్క తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, శంకర్, బొమ్మగాని వెంకన్న, ఎడ్లపల్లి నవీన్, విజయ్, వడ్లమూడి వెంకయ్య, పోతులూరి, తాత హనుమంతరావు, కాంపాటి రామారావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News