Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్

18-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. అయితే రంజాన్ మాసం దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతోంది. గతంలో 1995 ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడే మళ్లీ ఫిబ్రవరిలో రంజాన్ మాసం ప్రారంభం కావడం విశేషం. మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్ర పండుగా భావించే రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. పవిత్ర మక్కా మసీదు నెలకున్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అలాగే సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారత్ లో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టుగా భావించవచ్చు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఈ మేరకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20 వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News