Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

అక్షర ప్రవీణ పురస్కారం అందుకున్న సూర్యాపేట కవి పోతుగంటి వీరాచారి

అక్షర ప్రవీణ పురస్కారం అందుకున్న సూర్యాపేట కవి పోతుగంటి వీరాచారి

 అక్షర ప్రవీణ పురస్కారం అందుకున్న సూర్యాపేట కవి పోతుగంటి వీరాచారి
January 22, 2026 08:16 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల పరిరక్షణకు అంకితమై నిరంతరం అక్షర సేవ చేస్తున్న సూర్యాపేట వాసి ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ పోతుగంటి వీరాచారికి అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సాహితీ సాంస్కృతిక పట్టాభిషేకమహోత్సవంలో ఘనంగా అందజేశారు.శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ అవార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ప్రాచీన కవుల వారసులచే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యంలో విశేష సేవలందించిన కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను జాతీయ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గుతున్న ఈ కాలంలోనూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక చైతన్యం కోసం డాక్టర్ పోతుగంటి వీరాచారి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం అధ్యక్షతన జరిగిన సభలో, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళ కమాండెంట్ డాక్టర్ కొండా నర్సింహారావు పాల్గొన్నారు. అలివేలు మంగ దేవి దంపతులు, శ్రీనాథ మహాకవి వారసుడు కావూరి శ్రీనివాసశర్మ, కంచర్ల గోపన్న వారసుడు శ్రీనివాసరావు, ఏనుగు లక్ష్మణ కవి వారసుడు శివప్రసాద్ గార్ల చేతులమీదుగా డాక్టర్ పోతుగంటి వీరాచారికి అక్షర ప్రవీణ పురస్కారం, మెమొంటో, ప్రశంస పత్రం, దుశ్శాలువా, పూలదండతో ఘనంగా సన్మానం నిర్వహించారు.

సమావేశానంతరం డాక్టర్ కొండా నర్సింహారావు మాట్లాడుతూ, నిజమైన సాహిత్యాన్ని సృజించే కవులకు ప్రాచీన కవులు పొందిన గౌరవాన్ని ఈ కాలంలోనూ కల్పించాలనే లక్ష్యంతో శ్రీశ్రీ కళావేదిక చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం మాట్లాడుతూ, అక్షరాన్ని గౌరవించే కవితా బంధువుల ఆత్మీయ స్నేహ బంధమే శ్రీశ్రీ కళావేదిక అని, తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు రెండు వందల యాభై మంది కవులు పాల్గొన్నారు. ఈ పురస్కారం అందుకున్న డాక్టర్ పోతుగంటి వీరాచారిని సాహితీవేత్తలు, బంధుమిత్రులు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News