Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు.. మిస్సింగ్ కేసులో బయటపడ్డ అసలు నిజం!

19-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్ : నమ్మిన బంధమే కాలయముడైంది. తోడబుట్టిన అక్క అని చూడకుండా ఓ తమ్ముడు అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం అక్కను హతమార్చి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేసిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారంలో కలకలం రేపింది.

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన లీలా దేవి (40), ఆమె తమ్ముడు పప్పు రామ్ కుమావత్ బాటసింగారంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి గ్రామంలో 120 గజాల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అయితే, ఆ ప్లాట్ తమ్ముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. గత కొంతకాలంగా లీలా దేవి తన వాటా కోసం తమ్ముడిని అడుగుతోంది. దీనికి నిరాకరించిన పప్పు రామ్, అక్కను వదిలించుకోవాలని పథకం వేశాడు.

హత్య మరియు మాయాజాలం:

ఫిబ్రవరి 28న ఇంట్లోనే లీలా దేవిని హత్య చేసిన నిందితుడు, మార్చి 2న మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి కార్లో తీసుకెళ్లి మజీద్‌పూర్ చెరువులో పడేశాడు. ఏమీ తెలియనట్లుగా, తన అక్క కిరాణా షాపుకు వెళ్లి కనిపించకుండా పోయిందని ఫిబ్రవరి 28న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచారణలో నిజం నిప్పులా..

మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, పప్పు రామ్ ప్రవర్తనపై అనుమానంతో గట్టిగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తేలింది. ఈ కేసులో పప్పు రామ్‌తో పాటు అతనికి సహకరించిన రాకేష్ కుమావత్, సునీల్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Sthanikam

అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు.. మిస్సింగ్ కేసులో బయటపడ్డ అసలు నిజం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News