Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:39 AM

ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
April 10, 2026 05:01 PM 217 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వల్లభపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సూర్యాపేట: చివ్వేంల మండలంలోని వల్లభపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకోవడం వల్ల రైతులకు నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

వల్లభపురం పరిసర గ్రామాల రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సమయానికి ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తమ వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి తీసుకురావాలని సూచించారు.వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మాజీ సర్పంచ్ మొగదాల లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు బానోతు వెంకటి, పట్టణ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, ఎస్సి విభాగం ఉపాధ్యక్షుడు చింతమళ్ల రమేష్, జిల్లా వాణిజ్య విభాగం చైర్మన్ కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఓబీసీ విభాగం అధ్యక్షుడు రావుల రాంబాబు, సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, డీసీసీ కార్యదర్శి వెన్న మధుకర్ రెడ్డి, నాయకులు చెంచల నిఖిల్, నారాయణ ప్రవీణ్ రెడ్డి, నాగు నాయక్, మద్దెబోయిన శ్రీనివాస్, వాజిద్ మియా, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News