Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:25 PM

ఆహార భద్రతపై ప్రజల్లో చైతన్యం అవసరం – కలెక్టర్ ప్రావీణ్య

06-04-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆహార భద్రత అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు, ఎక్స్పైరీ తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో సోమవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆహార పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, లైసెన్స్ మేళా, ఫుడ్ స్టాళ్లు నిర్వహించి, ఆహారంలో కల్తీలపై లైవ్ డెమోన్స్ట్రేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా “పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు సరైన మార్గం” అనే పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు పొందుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ప్రజలు కల్తీ ఆహారం బారినపడకుండా కొనుగోలు ముందు నాణ్యత, గడువు తేదీలను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా కల్తీ ఆహారం గుర్తించినట్లయితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుండి 11 వరకు “ఆరోగ్య వారోత్సవం” నిర్వహిస్తున్నదని, ప్రజలు ఇందులో పాల్గొని అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఫిర్యాదుల కోసం 9908978790, 9985600602 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఆర్డీవో రాజేందర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అమృత, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆహార భద్రతపై ప్రజల్లో చైతన్యం అవసరం – కలెక్టర్ ప్రావీణ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News