రామన్నపేట: మండలంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామన్నపేట గ్రామంలోని మైనార్టీ కాలనీలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్పీజీ గ్యాస్ లీకేజీ లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. గ్యాస్ వాసన వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆపడం, ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్ చేయకపోవడం, వెంటిలేషన్ కల్పించడం వంటి ముఖ్య సూచనలు తెలియజేశారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి ఎస్‌ఎఫ్‌ఓ బి.మధుసూదన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ డి. రామ్ నరసయ్య, సిబ్బంది షఫీ, పాండు, గోపాల్, మధు పాల్గొన్నారు. కాలనీ ప్రజలు జావేద్, ఖాసిం, షాహిద్ తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి