Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

26-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనీస వేతనాలు, గ్రాచ్యుటీ అమలు చేయాలని డిమాండ్

అంగన్వాడీ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, తక్కువ వేతనాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతను మోస్తున్న అంగన్వాడీలు నేటి బాలల సంరక్షణ, పోషణ, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు.

ఐసిడిఎస్‌ కార్యక్రమం అభివృద్ధికి అంగన్వాడీల శ్రమే ప్రధాన కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని అన్నారు. ఉద్యోగులతో సమానంగా, అంతకంటే ఎక్కువగా పని చేస్తున్నా కనీస కార్మిక హక్కులు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడల్లా అదనపు బాధ్యతలను అంగన్వాడీలపై మోపుతున్నారని తెలిపారు.

ఉన్నత న్యాయస్థానాల తీర్పుల ప్రకారం కనీస వేతనాలు, గ్రాచ్యుటీ, పీఎఫ్‌, ఈఎస్ఐ వంటి సదుపాయాలు అమలు చేయాలని, వేసవి సెలవులు పూర్తిగా ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2024లో జారీ చేసిన జీఓ నెం.8 ప్రకారం కూడా గ్రాచ్యుటీ చట్టం అమలు కాలేదని, గత ఏడు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు పిల్లలు, గర్భిణీలకు అందాల్సిన సరుకుల నాణ్యత, పరిమాణం పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీఅంగన్వాడీ కార్యకర్తల నాయకుడు ఏ. విజయ్‌కుమార్, సీపీఐ పట్టణ సహకారదర్శి లక్ష్మీనారాయణ, లింగప్ప,ఏఐవైఎఫ్ కార్యదర్శి అంజిత్‌గౌడ్‌తో పాటు అధ్యక్షురాలు జానకి, ఈరమ్మ, గీత, సుస్మిరి, రోషన్‌, శాంతి, సరస్వతి, శంకరమ్మ, రేణుక, సరోజ, రాజ్యలక్ష్మి, కమల, జ్యోతి, విజయ, భూలక్ష్మి తదితర అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News