Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 AM

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం
20-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అనే సూక్తిని స్మరిస్తూ, వైద్యాన్ని కేవలం వ్యాపారంగా చూడకుండా సామాజిక దృక్పథంతో రోగులకు సేవలు అందించాలన్నారు . ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మీసా రోహిత్ ఎంబిబిఎస్,ఎండి క్రిటికల్ కేర్ మరియు ఊపిరితిత్తుల ప్రత్యేక వైద్య నిపుణులు, డాక్టర్ కూరపాటి శ్రీలేఖ ఎంబిబిఎస్, డిజిఓ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు ఇరువురు యువ వైద్యులు కోదాడలో సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కారింగుల అంజి, డాక్టర్ దశరథ,డాక్టర్లు రామారావు, అశోక్, గౌరీనాథ్, ప్రసాద్,కరుణశ్రీ, సురేష్, కొత్తమాసు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు........

Sthanikam

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News