Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 04:25 AM

ఆదోనిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
February 27, 2026 01:52 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

70 మందికి రూ.27.56 లక్షలు – టిడిపి ఆధ్వర్యంలో కార్యక్రమం

ఆదోని : నియోజకవర్గంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 70 మంది బాధితులకు మొత్తం రూ.27,56,659 ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.

మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పారు. పేదలు ఆపదలో ఉన్నప్పుడు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మీనాక్షి నాయుడు సహకారంతో 489 మందికి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.1,00,73,178ను బాధితులకు అందజేశామని వెల్లడించారు. ఇంకా 241 చెక్కులు రావాల్సి ఉన్నాయని వివరించారు.

కార్యక్రమంలో జిందేశంకర్, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మండల అధ్యక్షుడు శివప్ప, కర్నూలు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ రంగన్న, అయ్యన్న, మాజీ కౌన్సిలర్ బాలాజీ, నారాయణపురం శేఖర్, ఎంపీటీసీ కరెప్ప, విరుపాక్షి, కృష్ణ, నాగరాజు, ధనసింగ్, సుబ్బారెడ్డి, అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News