Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:05 AM

ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

06-03-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో గొడుగు శ్రీహరి, కౌసల్య దంపతుల కుమారుని వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, ఆహ్వానితుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని అన్నారు. పరస్పర అవగాహన, ప్రేమ, సహకారంతో వధూవరులు తమ కుటుంబ జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి ఆదర్శంగా నిలిచే విధంగా జీవితం సాగించాలని ఆశీర్వదించారు. వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక సందర్భంగా ఆహ్వానితులు వధూవరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లాల సైదులు యాదవ్, లింగాల సైదులు, శేఖర్, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

Sthanikam

ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News