Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: ఎంపీడీవో శేషగిరి శర్మ

16-03-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేసవి నీటి సమస్యలపై ముందస్తు చర్యలు.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సర్పంచులకు సూచనలు

మిర్యాలగూడ,

కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎంపీడీవో శేషగిరి శర్మ సూచించారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గ్రామ పంచాయతీ నిధులతో పైపులైన్ మరమ్మతులు, గేట్ వాల్వ్ రిపేర్లు, ఓపెన్ ట్యాప్స్‌కు ఆన్–ఆఫ్ వ్యవస్థ బిగింపు, మోటార్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టాలని సూచించారు.

అవసరమైతే కొత్త మోటార్ల కొనుగోలు, అద్దె బోర్లు ఏర్పాటు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామపంచాయతీ భవనాలు, వివో భవనాలు, సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, టాయిలెట్లు వంటి పనులను వెంటనే ప్రారంభించి మార్చి 31లోపు పూర్తి చేయాలని సూచించారు.

ఉగాది పండుగ నాటికి చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించేందుకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో శాతం వందకు పన్నులు వసూలు చేయాలని, వచ్చే సంవత్సరానికి పన్నుల డిమాండ్ సిద్ధం చేయాలని తెలిపారు.

అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించి సేంద్రియ ఎరువు తయారీ చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో మంచి రకమైన నారు నాటించి జూన్‌లో జరిగే వనమహోత్సవానికి ఐదు నుంచి ఆరు అడుగుల మొక్కలను సిద్ధం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జి. వెంకట్ రెడ్డి, ఎంపీ ఓ రాఘవరావు, డివిజన్ పంచాయతీ అధికారి రాఘవరావు, ఎంపీ ఓ రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భవాని, పీఆర్ ఏఈ వరలక్ష్మి, మండల సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: ఎంపీడీవో శేషగిరి శర్మ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News