Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:23 AM

ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు

27-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య స్కూల్‌లో ఈ నెల 27వ తేదీ శుక్రవారం వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు రాయల్ కాలనీ సమీపంలోని స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్ ఎంఎల్ఎస్‌సీ జి. కవితా దేవి హాజరుకానున్నారు. అతిథులుగా జహీరాబాద్ టౌన్ సి.ఐ. ఎస్. శివలింగం, మండల విద్యాధికారి మాణయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారికి సన్మానం కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది కోరారు.

Sthanikam

ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News