Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:08 PM

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి దామోదర రాజనర్సింహ

02-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రూ.69.19 కోట్ల రుణాల పంపిణీతో మహిళా సంఘాలకు భారీ ఊతం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దృష్టిలోపం కలిగిన నలుగురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు 768 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.69.19 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ట్రాన్స్‌జెండర్‌లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే పీఎం శ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాల నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.అంతకుముందు ఐబీ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News