Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:02 AM

అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను పరిశీలించిన జిల్లా కలెక్టర్

12-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్ కన్వెన్షన్ లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాసంబంధాల అధికారి వల్లోజి శ్రీనివాసరావు ఈ ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా ఫోటోలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను జిల్లా కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ఫోటో ప్రదర్శన ఏర్పాట్లలో సీనియర్ సహాయకుడు పి. సుధాకర్, రికార్డు సహాయకుడు అనిల్ కుమార్, డ్రైవర్లు రహీం, అశోక్, నరేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి శిరీష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News