Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:28 AM

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు

24-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) 26వ జాతీయ సదస్సు బుధవారం నుంచి రెండు రోజుల పాటు ప్రారంభమవుతోంది. “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై నిర్వహించే ఈ సదస్సులో డిజిటల్ పరివర్తన, విధానపరమైన మార్పులు, సమ్మిళిత విద్యాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.

ఈ సదస్సు ప్రారంభోత్సవానికి BRAOU వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించగా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆనందరావు విష్ణు పాటిల్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. IGNOU ఉపకులపతి ప్రొ. ఉమా కంజిలాల్, కేరళ డిజిటల్ యూనివర్సిటీ వీసీ ప్రొ. సాజి గోపీనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ కీలకోపన్యాసం చేయనున్నారు.

సదస్సులో భాగంగా “డిజిటల్ టెక్నాలజీ: ఓడీఎల్ భవిష్యత్తు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం, ప్యానెల్ చర్చలు, సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు. రెండవ రోజు డిజిటల్ లెర్నింగ్ నిపుణుడు ప్రొ. సంజయ్ మిశ్రా స్మారక ఉపన్యాసంతో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి 100కు పైగా పరిశోధకులు పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Sthanikam

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News