Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 10:49 AM

ఆసరా సేవలకు గౌరవం

ఆసరా సేవలకు గౌరవం

ఆసరా సేవలకు గౌరవం
January 25, 2026 06:31 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మేడి హరికృష్ణకు ఉత్తమ సేవ పురస్కారం

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ కు సమాజ సేవలకుగాను ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ సేవ పురస్కారం లభించింది. విద్య, ఆరోగ్యం, క్రీడలు, పేదల సహాయం వంటి అనేక రంగాల్లో ఆయన చేసిన నిరంతర సేవలను గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేశారు.మిర్యాలగూడ పట్టణానికి చెందిన జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన స్వచ్ఛంద సేవా సంస్థల ఆత్మీయ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు జిల్లాలోని పలువురు సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేడి హరికృష్ణ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ తెలుగు హాస్య–వినోద సినీ నటుడు సుమన్ శెట్టి హరికృష్ణకు పురస్కారాన్ని అందజేశారు. సమాజ సేవలో యువత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థల సేవలు సమాజ అభివృద్ధికి కీలకమని ఆయన పేర్కొన్నారు.ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేడి హరికృష్ణ ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు విద్యా సహాయం, క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహం, రక్తదాన శిబిరాల నిర్వహణ, అవసరమైన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి పలువురి మన్ననలు పొందారు.ప్రత్యేక సందర్భాల్లో ప్రకృతి విపత్తులు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు విస్తరించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.పురస్కారం అందుకున్న అనంతరం మేడి హరికృష్ణ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, సమాజంలోని అణగారిన వర్గాల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. తన సేవలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షరీఫ్, ప్రపంచ బ్లడ్ రికార్డు అవార్డు గ్రహీత సంపత్ కుమార్, మురళి తదితర ప్రముఖులు పాల్గొని మేడి హరికృష్ణను అభినందించారు. స్వచ్ఛంద సేవా రంగంలో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News