Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం

Updated : 30 Dec 2025 13:42 IST
As Preferred Source 1 min read
ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలంలోని నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కల్హేర్ గ్రామానికి చెందిన టేకు మరియమ్మ భర్త పాపయ్య గారు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ విషయం గ్రామ ప్రజలు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకెళ్లగా,వెంటనే స్పందించిన ఆయన ఫౌండేషన్ తరపున కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు. అలాగే కుటుంబానికి ధైర్యం చెప్పి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కల్హేర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి సాయిలు,జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలంలోని నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కల్హేర్ గ్రామానికి చెందిన టేకు మరియమ్మ భర్త పాపయ్య గారు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ విషయం గ్రామ ప్రజలు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకెళ్లగా,వెంటనే స్పందించిన ఆయన ఫౌండేషన్ తరపున కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు. అలాగే కుటుంబానికి ధైర్యం చెప్పి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కల్హేర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి సాయిలు,జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news