Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:53 PM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యం: నీలం మధు ముదిరాజ్

11-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మనిషి అనేక ఒత్తిళ్లకు లోనవుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక ఆలోచనలు మనస్సుకు శాంతిని, జీవితానికి సరైన దిశను అందిస్తాయని ఆయన తెలిపారు.ఆదివారం గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండలం వరదరాజపురం గ్రామంలో శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో నిర్వహించిన లక్ష్మీ నారాయణ హోమం, లక్ష పుష్పార్చన మహోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ శాసనసభ్యుడు నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆంక్ష రెడ్డితో కలిసి నీలం మధు ముదిరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు నీలం మధు ముదిరాజ్‌కు ఘన స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వరదరాజ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సద్భావన, ఐక్యత పెరగాలంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలను ఏకం చేస్తాయని, ధర్మ మార్గంలో నడిచేలా ప్రేరణనిస్తాయని ఆయన పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధితో పాటు సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కిష్టయ్య, ఆలయ కమిటీ చైర్మన్ ప్రొద్దుటూరి గోపాలకృష్ణ, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఉప చైర్మన్ సర్దార్ ఖాన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, నాయకులు విజయ్ మోహన్, నర్సింలు, రవి, భగవాన్, మల్లేష్, స్వామి, అర్జున్, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యం: నీలం మధు ముదిరాజ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News