Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:39 AM

ఆధునిక సౌకర్యాలతో స్పర్శ పిల్లల హాస్పిటల్ ప్రారంభం

22-01-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మెడికల్ హబ్‌గా మారుతుంది

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మల హాస్పిటల్ రోడ్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్పర్శ పిల్లల హాస్పిటల్‌ను ప్రముఖ వైద్యులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వేగంగా మెడికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో సూర్యాపేటలో దాదాపు రెండువందల ప్రైవేట్ హాస్పిటళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో సమస్యలు, మూత్రపిండ వైద్యం వంటి అత్యాధునిక వైద్య సేవలు సూర్యాపేటలోనే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మోకాళ్ల చిప్పలు మార్పిడి చేసే వైద్యం సైతం సూర్యాపేట వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో బైపాస్ శస్త్రచికిత్సలు కూడా సూర్యాపేటలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

సూర్యాపేటకు చెందిన తిరునగరు భరత్ పూర్తి వైద్య విద్యను అభ్యసించి, స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో స్పర్శ పిల్లల హాస్పిటల్‌ను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. చిన్నపిల్లల వైద్యం కోసం అనేక మంది హైదరాబాద్‌కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉందని, స్పర్శ హాస్పిటల్‌లో తక్కువ ధరలకు నాణ్యమైన వైద్యం అందించి పేదలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యుల సంఘం చైర్మన్ డాక్టర్ ఆనంద్ దాంగ్డే, హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తిరునగరు భరత్, తిరునగరు శ్రీనివాస్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆధునిక సౌకర్యాలతో స్పర్శ పిల్లల హాస్పిటల్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News