Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:33 AM

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అభివృద్ధి ప్రగతిని వెల్లడించిన కలెక్టర్

26-01-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రసంగిస్తూ, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులు, పాత్రికేయులు, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నిలబెట్టిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందని, రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబేడ్కర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలు, గిరిజనులు, షెడ్యూల్డ్ కులాలు, మహిళలు, మైనారిటీలకు రక్షణలు, సమాన హక్కులు, సామాజిక-ఆర్థిక న్యాయం లభించాయని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో అమలవుతున్న పథకాల ప్రగతిని వివరించారు.

???? ముఖ్య సంక్షేమ, అభివృద్ధి అంశాలు:

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్ల రూపాయల ఆదా, రూ.500కి వంట గ్యాస్ పథకం అమలు, సన్న వరికి బోనస్‌తో రైతులకు లబ్ధి, భారీగా వరి ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, రైతు భీమా పథకాల అమలు, సహజ వ్యవసాయం, ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహాలు, ఉచిత విద్యుత్, కొత్త విద్యుత్ కనెక్షన్లు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లక్షల పనిదినాలు, విద్య, ఆరోగ్యం, నీటిపారుదల, రోడ్లు-భవనాల రంగాల్లో భారీ పెట్టుబడులు, జిల్లాలో వైద్య సేవలు, విద్యా సంస్థలు, వ్యవసాయ కళాశాలలు, నివాస పాఠశాలలు, సాగునీటి పథకాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, జిల్లా ప్రజల సహకారంతో సూర్యాపేటను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Sthanikam

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అభివృద్ధి ప్రగతిని వెల్లడించిన కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News