Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 10:50 PM

632 మంది సేవలు నిలిపివేత మెమో రద్దు చేయాలి

632 మంది సేవలు నిలిపివేత మెమో రద్దు చేయాలి

632 మంది సేవలు నిలిపివేత మెమో రద్దు చేయాలి
February 25, 2026 06:23 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టైపిస్టు–కంప్యూటర్ నిర్వాహకులకు వేతన శ్రేణి కల్పించాలి

యాదాద్రి భువనగిరి: రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న టైపిస్టు–కంప్యూటర్ నిర్వాహకుల సేవలను యథావిధిగా కొనసాగించాలని, వేతన శ్రేణి కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకు చెందిన సిబ్బంది వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సంయుక్త చర్యా సమితి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సి. జగన్ మోహన్ ప్రసాద్‌ను కలిసి సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 632 మంది టైపిస్టు–కంప్యూటర్ నిర్వాహకుల సేవలను నిలిపివేస్తూ జారీ చేసిన మెమోను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజావాణి పోర్టల్ నిర్వహణ, రేషన్ కార్డుల జారీ, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల అమలులో వీరి పాత్ర కీలకమని తెలిపారు.

ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వెంటనే వేతన శ్రేణి కల్పించి శాశ్వత ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులను పోషిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ సిబ్బందిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సి. జగన్ మోహన్ ప్రసాద్, జిల్లా కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, నాయకులు ఆర్. గణేశ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News