Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:08 PM

42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర

29-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడగా విషయం తెలిసిన వెంటనే మన సమాజం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం మహేష్ స్వామి స్పందించి పేషెంట్ వివరాలను ఫౌండేషన్ సభ్యులు మరియు పరిచయస్తులకు పంపించారు. ఈ సమాచారాన్ని చూసిన కోడూరు శరత్ చంద్ర వెంటనే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. ఇప్పటివరకు ఆయన 42వ సారి రక్తదానం చేయడం విశేషం. అత్యవసర సమయంలో స్పందించి ప్రాణ రక్షణకు సహకరించిన శరత్ చంద్రకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంగం మహేష్ స్వామి మాట్లాడుతూ సమాజంలో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నప్పుడు మన సమాజం ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్నారని, ఇప్పటివరకు అనేక మందికి రక్తదానం ద్వారా సహాయం చేసినట్లు తెలిపారు. రక్తదానం మహాదానం అని, యువత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సమయానికి స్పందించి సహాయం చేసిన ఫౌండేషన్ నిర్వాహకులకు మరియు రక్తదాత కోడూరు శరత్ చంద్రకు పేషెంట్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News