Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:33 AM

23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ

12-01-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కరపత్రం ఆవిష్కరించిన అడ్‌హక్ కమిటీ

మహాసభను విజయవంతం చేయాలని పిలుపు

సూర్యాపేట, జనవరి 12:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ జిల్లా అడ్‌హక్ కమిటీ నాయకులు ప్రకటించారు.ఈ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మహాసభలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా జర్నలిస్టుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.జర్నలిస్టుల దీర్ఘకాలిక డిమాండ్లైన అక్రెడిటేషన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, ఉచిత బస్ పాస్ తదితర హక్కుల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఫెడరేషన్ చేపడుతున్న ఉద్యమాలకు జిల్లాలోని జర్నలిస్టులంతా ఐక్యంగా కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య, కో కన్వీనర్లు ముషం హరిప్రసాద్, లింగాల సాయిబాబా, నందిపాటి సైదులు, శ్రీరాముల కృష్ణ, తాందారపల్లి శ్రీనివాస్, నాయకులు గుడపూరి ప్రభాకర్, పాల్వాయి అజయ్, పి. సతీష్, ఎస్. సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News