Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం
28-05-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో ఏర్పాటు

మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో, 'దివిస్ లాబొరేటరీస్' కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు.​మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను కలసి రిబ్బన్ కట్ చేసి ఈ ప్లాంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.తమ వార్డులో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల 20వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దానికి దివిస్ లాబొరేటరీస్ యాజమాన్యం సహకరించడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఇకపై తమ తాగునీటి సమస్యలు పూర్తిగా తీరిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో దివిస్ లాబొరేటరీస్ ప్రతినిధులు కిషోర్, గోపి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News