స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డు మసీద్ బజార్ పరిధిలో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టడంపై స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వార్డు వాసులు మాట్లాడుతూ, ఎంతో కాలంగా అద్వానంగా ఉన్న రోడ్ల సమస్యను గుర్తించి పరిష్కారానికి చొరవ చూపిన ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు మరమ్మతులతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు తొలగి, ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని వార్డు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి