Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:57 AM

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం
12-02-2026 284 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బాధ్యులైన ఎస్‌ఐ ఏడుకొండలు, సీఐ రాజశేఖర్‌లను సస్పెండ్ చేయాలి – మామిడి అంజయ్య డిమాండ్

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13వ వార్డులో జరిగిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో కారు ఎక్కేందుకు వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ కుమారుడిపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటన పోలీసు శాఖకు కళంకమని వ్యాఖ్యానించిన ఆయన, పోలీసులు చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించరాదని హితవు పలికారు.కొన్ని అగ్రవర్ణ పార్టీల నాయకులు వట్టె జానయ్య యాదవ్‌ను బెదిరించాలనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తోందని, ప్రజాభిమానంతో 5 నుండి 6 వార్డుల్లో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

వట్టె జానయ్య యాదవ్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి అని పేర్కొంటూ, దాడులు చేసి పార్టీని వెనక్కి నెట్టలేరని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించబడిందని గుర్తుచేశారు. నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులు కొనసాగితే సహించబోమని హెచ్చరించారు.లోయల పాఠశాల ముందు జరిగిన ఘటనకు బాధ్యులైన ఎస్‌ఐ ఏడుకొండలు, సీఐ రాజశేఖర్‌లపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నెమంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి మనోహర్, రంగన్న, వర్మ, గోపి, రంప శ్రీదేవి, తండు నాగలక్ష్మి, వాల్మీకి దీపమాల, కంటేకర్ రఘుమోహన్, నెలచర్ల మధు ప్రజాపతి, బోడపట్ల మధు, సురేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News