Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:51 AM

యూడీఐడి కార్డులను సద్వినియోగం చేసుకోవాలి అర్హులైన ప్రతి దివ్యాంగుడు తప్పనిసరిగా పొందాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచన

17-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

అంగవైకల్యంతో బాధపడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యూడీఐడి కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం ఎల్‌బీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యూడీఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పలువురు దివ్యాంగులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో యూడీఐడి కార్డు కీలకమని, దీని ద్వారా వివిధ రకాల సౌకర్యాలు, రాయితీలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

అర్హులైన ప్రతి దివ్యాంగుడు యూడీఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకొని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని ఆయన సూచించారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైతన్యపూరి డివిజన్ యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శివప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మందా బిక్షపతి యాదవ్, ఎల్‌బీనగర్ మహిళా అధ్యక్షురాలు వర్కాల భాగ్యలక్ష్మి, సిద్ధం నర్సింగ్, పద్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యూడీఐడి కార్డులను సద్వినియోగం చేసుకోవాలి అర్హులైన ప్రతి దివ్యాంగుడు తప్పనిసరిగా పొందాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచన

Article Image

అంగవైకల్యంతో బాధపడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న యూడీఐడి కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం ఎల్‌బీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యూడీఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పలువురు దివ్యాంగులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో యూడీఐడి కార్డు కీలకమని, దీని ద్వారా వివిధ రకాల సౌకర్యాలు, రాయితీలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

అర్హులైన ప్రతి దివ్యాంగుడు యూడీఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకొని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని ఆయన సూచించారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైతన్యపూరి డివిజన్ యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శివప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మందా బిక్షపతి యాదవ్, ఎల్‌బీనగర్ మహిళా అధ్యక్షురాలు వర్కాల భాగ్యలక్ష్మి, సిద్ధం నర్సింగ్, పద్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News