Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:10 PM

యశోద ఆస్పత్రిలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

05-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్లో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ నిపుణుడు డాక్టర్. విక్రమ్ భైరి ఆధ్వర్యంలో ఈ చికిత్స జరిగింది.

గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సంకల్ప్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 78 ఏళ్ల రాజలక్ష్మి అనే మహిళకు రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు.

శస్త్రచికిత్స చేసిన రోజే సాయంత్రానికి ఆమె ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లినట్లు చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగి ఐదు నెలలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆమెకు ఎలాంటి కాళ్ల లేదా కీళ్ల నొప్పులు లేకుండా మునుపటికంటే మెరుగ్గా నడవగలుగుతున్నారని వెల్లడించారు.

మోకాళ్ల నొప్పులతో బాధపడే రోగులకు శాతం మేర ఉపశమనం కలిగేలా చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ విక్రమ్ భైరి తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ చేయించుకోవడం చాలా ముఖ్యమని, పాజిటివ్ మైండ్‌తో ఒత్తిడిని తగ్గించుకుంటే త్వరగా కోలుకునే అవకాశముందని సూచించారు.

శస్త్రచికిత్స చేయించుకున్న రాజలక్ష్మి మాట్లాడుతూ… మోకాళ్ల నొప్పుల వల్ల నడవడం కూడా కష్టంగా ఉండేదని, ప్రతి అడుగులోనూ తీవ్రమైన నొప్పి అనుభవించాల్సి వచ్చేదని తెలిపారు. యశోద ఆస్పత్రిలో డాక్టర్ విక్రమ్ భైరిని సంప్రదించి రోబోటిక్ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎలాంటి నొప్పులు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యశోద ఆస్పత్రి మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ మేనేజర్ వెంకట్, ఎగ్జిక్యూటివ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యశోద ఆస్పత్రిలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News