Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:32 PM

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

15-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని కోరుతూ Communist Party of India (Marxist) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

సోమవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక నిరాహార దీక్షల కోసం ఏర్పాటు చేసే శిబిర స్థలాన్ని మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ, మండల పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం దుర్భర పరిస్థితిలో ఉందని అన్నారు. కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రి వెలవెలబోతుండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సరైన వైద్యం అందక ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని, దీంతో పేదలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తగిన నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణంతో పాటు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

Sthanikam

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News