Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

వాన బీభత్సం.. హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

26-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65 పూర్తిగా జలమయమైంది. రహదారిపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వర్షపు నీరు భారీగా రోడ్డుపై చేరడంతో వాహనాలు నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి కదలాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు.ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడగా, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రహదారులపైకి చేరి రాకపోకలకు అంతరాయం కలిగించింది. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వ తొలగింపు చర్యలు చేపట్టారు.

Sthanikam

వాన బీభత్సం.. హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News