Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:27 AM

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

26-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆదోని పట్టణంలో ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. పాంప్లెట్లు, ఫ్లెక్సీల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తూ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

పట్టణంలో ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, ఆర్‌ఐఓ స్పందించకపోవడం విచారకరమన్నారు. అక్రమ ఫీజులను అరికట్టి, ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై విచారణ జరిపి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు వరుణ్‌రాజు, తిక్కస్వామి, కిరణ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News