Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:54 PM

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 విజయవంతం

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 విజయవంతం

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 విజయవంతం
March 05, 2026 06:13 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్, జిల్లా వికసిత్ యూత్ పార్లమెంట్ చైర్మన్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జ్యూరీ సభ్యులుగా రిటైర్డ్ ప్రిన్సిపల్ భగవంత్ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ శీలం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ మంజుల చకీలం, కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు గురవయ్య, పర్యావరణ శాస్త్రవేత్త సురేష్ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్య అతిథి డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ యువత ఆలోచనలు, భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన యువత రాష్ట్ర అసెంబ్లీ, జాతీయ పార్లమెంట్ స్థాయిలో తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నోడల్ కోఆర్డినేటర్ కోటయ్య మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా స్థాయి పోటీ అంశం “50 Years of Emergency: Lessons for Indian Democracy” పై విద్యార్థులు మూడు నిమిషాలపాటు ప్రసంగించి ప్రతిభ కనబర్చారని తెలిపారు. ప్రతిభావంతులను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసి రాష్ట్ర అసెంబ్లీ స్థాయి పోటీలకు పంపించామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ కోటయ్య, డాక్టర్ బొజ్జా అనిల్ కుమార్, డాక్టర్ ఆదె మల్లేశం, కంబాలపల్లి శివరాణి, మందా సావిత్రి, అంకూస్, నాగరాజు, బోధన–బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News