Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

18-04-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరులో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువత కోసం 37 రకాల యూనిట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, విడుదలైన నోటిఫికేషన్లలో వికలాంగుల రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పేర్కొంది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. దీనివల్ల స్వయం ఉపాధి అవకాశాల్లో వికలాంగులు వెనుకబడుతున్నారని తెలిపారు.

ఈ అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ, జిల్లా స్థాయి నోటిఫికేషన్లలో మార్పులు కనిపించడం లేదని చెప్పారు. వెంటనే నోటిఫికేషన్లు సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ ప్రకటనపై అధ్యక్షుడు సురూప ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు సంతకాలు చేశారు.

Sthanikam

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News