Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:37 AM

విజయవాడ కోర్టు సంచలన తీర్పు పెళ్లి పేరుతో సొంత చెల్లిని అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

13-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చెల్లిపై అత్యాచారం చేసిన అన్నపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు

స్పీడ్ ట్రయల్‌గా విచారణ జరిపిన విజయవాడ పోక్సో కోర్టు న్యాయాధికారి

మరణించే వరకు జీవితకాల కారాగార శిక్ష విధించిన న్యాయమూర్తి

సొంత చెల్లిని పెళ్లి చేసుకొని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భానికి కారణమైన యువకుడి కేసులో విజయవాడ పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి మరణించే వరకూ జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబానికి చెందిన దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు విడిగా నివసిస్తున్నారు. తల్లి ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో ఉండగా, తండ్రి కుమారుడితో కలిసి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెంట్లూరులో స్థిరపడ్డాడు. 2023లో 21 ఏళ్ల కుమారుడు తల్లి, చెల్లెళ్లను కలిసేందుకు వస్తున్నానని చెప్పి మంటాడకు చేరుకున్నాడు. అక్కడ పెద్ద చెల్లి (17)తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2024 క్రిస్మస్ సందర్భంగా మళ్లీ మంటాడకు వచ్చిన అతడు.. తండ్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పి బాలికను విజయవాడలోని ఓ చర్చికి తీసుకెళ్లి తాళి కట్టాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసిన తరువాత నిందితుడు ఆమెను గత ఏడాది ఫిబ్రవరిలో ఒంగోలు బస్టాండులో వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన బాలిక కొన్ని రోజులకే జ్వరం, వాంతులతో అస్వస్థతకు గురి కావడంతో తల్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భిణిగా తేలింది. ఆమెను తల్లి గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పమిడిముక్కల పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ నిందితుడిని పెంట్లూరులో అరెస్టు చేశారు. ఈ కేసును స్పీడ్ ట్రయల్‌గా విజయవాడ పోక్సో కోర్టు జడ్జి వి.భవానీ విచారణ జరిపి నిన్న తీర్పు వెల్లడించారు. నిందితుడికి మరణించే వరకు జీవితకాల కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి బాలికకు అందాల్సిన రూ.5 లక్షల సహాయం త్వరగా అందేలా చూడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది.

Sthanikam

విజయవాడ కోర్టు సంచలన తీర్పు పెళ్లి పేరుతో సొంత చెల్లిని అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News