Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

01-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు మరచిపోలేనివని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర అమోఘమని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్, సీనియర్ నాయకులు జగన్, ఆర్కే భూపాల్, నాగజ్యోతి, మంజూష, తొలి దశ ఉద్యమకారులు కొండ స్వామి, ఆడెపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News