Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!

31-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్,

దాదాపు నెలరోజులుగా కొనసాగిన వేసవి సెలవులకు నేటితో ముగింపు పలుకుతూ తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి సందడి చేయనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే తరగతులు ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమయ్యారు.

ఇంటర్ బోర్డు ఇప్పటికే కళాశాలల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయగా, హాజరు, సిలబస్ అమలు, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని యాజమాన్యాలకు సూచించింది. తొలి రోజు నుంచే బోధన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యాసంస్థలకు సెలవులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను జూన్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో తెలంగాణలో విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగుపెడుతుండగా, ఏపీలోని విద్యార్థులకు మరో వారం రోజుల విశ్రాంతి లభించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, విద్యా క్యాలెండర్ల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Sthanikam

వేసవి సెలవులకు ముగింపు.. నేటి నుంచే ఇంటర్ బాట!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News