Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు గడువు ముగిసిన చిల్లి సాస్ స్వాధీనం

31-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట పట్టణంలోని పలు హోటళ్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రాలయం, త్రినేత రాఘవేంద్ర, సన్నిధి హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా సన్నిధి హోటల్ స్టోర్‌రూమ్‌లో గడువు ముగిసిన కొన్ని చిల్లి సాస్ బాటిళ్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్న కొన్ని అనుమానాస్పద పదార్థాలు, పలు కంపెనీల తాగునీటి సీసాలు, వంట సామగ్రికి సంబంధించిన నమూనాలను సేకరించారు.

సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు లేదా మోతాదుకు మించి హానికర పదార్థాలు ఉన్నట్లు తేలితే సంబంధిత హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు గడువు ముగిసిన చిల్లి సాస్ స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News