Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాసం వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:57 PM

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

31-05-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ముమ్మరంగా వలిగొండ బీటీ రోడ్డు నిర్మాణ పనులు

* ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో శాశ్వత పరిష్కారం

మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. స్థానిక వలిగొండ రోడ్డులో అధ్వాన్నంగా మారిన రహదారికి ఆదివారం ఆమె చొరవతో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కోర్టుకు వెళ్లే దారి వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గతంలో ఈ వలిగొండ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేసినప్పటికీ, భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డు మళ్లీ పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారిందన్నారు. దీనివల్ల వాహనదారులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించి తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. నిర్మాణ కాంట్రాక్టర్‌తో మాట్లాడాం. మరో 15 రోజుల్లో నాణ్యమైన బీటీ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. గత కొంతకాలంగా గుంతల రోడ్డుతో నరకం చూస్తున్న తమకు, చైర్‌పర్సన్ చొరవతో మళ్లీ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News