Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:12 AM

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి

31-05-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

యాక్షన్ ప్లాన్‌తో పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

సూర్యాపేట పట్టణంలో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్, మున్సిపల్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లతో సమావేశమై పనుల జాప్యంపై ఆరా తీసినట్లు తెలిపారు. యూజీడీ పనుల కారణంగా రోడ్లు తవ్విన ప్రాంతాల్లో పనులు ఆలస్యం కావడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా పనులు పూర్తైన ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణ త్వరితగతిన చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. యూజీడీ పనులు పూర్తయిన వెంటనే సీసీ రోడ్ల పునరుద్ధరణ చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నట్లు తెలిపారు.రోడ్డు వారీగా పనుల పురోగతికి స్పష్టమైన టైమ్‌లైన్‌తో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని, ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి దెబ్బతిన్న మౌలిక వసతులను త్వరితగతిన పునరుద్ధరించాలని సూచించినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థ పనితీరును సమీక్షిస్తూ పనుల నాణ్యత, వేగంపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.

Sthanikam

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News