Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి: గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు

06-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతపై ఆగ్రహం – నిర్వాసితులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్

ఖమ్మం: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో అర్హులైన నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మరియు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు.

శుక్రవారం వారు వెలుగుమట్ల భూదాన భూముల ఇండ్ల స్థలాల సాధన కమిటీ నాయకులు గుండా సత్యనారాయణ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగుమట్లలోని 31 ఎకరాల భూమిలో సుమారు 400 మంది పేద కుటుంబాలు 2018 డిసెంబర్ నుంచి నివాసం ఉంటున్నారని తెలిపారు. పేదలు తమ కష్టార్జిత డబ్బుతో పాటు కుటుంబంలోని మహిళల చిన్నచిన్న బంగారు ఆభరణాలు అమ్మి, అప్పులు తెచ్చుకొని ఇళ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 24, 25 తేదీలలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు కలిసి ఎలాంటి విచారణ లేకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

పేదల గూళ్లను చెదరగొట్టి వారిని దిక్కులేనివారిగా మార్చడం ప్రజా పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేస్తూ, మరోవైపు పేదల ఇళ్లను కూల్చివేయడం ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రగతి ప్రణాళికకు విరుద్ధమని విమర్శించారు.

ఇళ్ల కూల్చివేతతో అక్కడ నివసిస్తున్న సుమారు 600 కుటుంబాలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలు ప్రస్తుతం ఖమ్మం నగరంలో బిక్షమెత్తుకునే పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతకు గురైన వారంతా పేదలేనని, వారిలో ఎవరూ ధనవంతులు గానీ ప్రభుత్వ ఉద్యోగులు గానీ లేరని పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలేమి ఉన్నవారి ఇళ్లు కూల్చివేసినట్లయితే వారికి నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వాలని లేదా మిగిలిన వారితో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు సి.వై. పుల్లయ్య, జి. రామయ్య, ఆవుల అశోక్, భూదాన భూముల ఇండ్ల స్థలాల సాధన కమిటీ నాయకులు వర్గాని కోటేశ్వరరావు, సిరికొండ కళ్యాణి, పోతురాజు ప్రశాంతి, షేక్ జరీనా, మేడి అనిత, నల్లబెల్లి కవిత, నాగుల సుజాత, వినుకొండ నాగరాజు, పసుమర్తి రవి, బొల్లు కోటేశ్వరరావు, సిహెచ్ వినయ్, వి. రమేష్, డి. నాగరాజు, పసుమర్తి సతీష్, షేక్ సుభాని, అజ్మీరా లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి: గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News