Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 01:19 PM

వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు

07-03-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యువతకు క్రీడలు క్రమశిక్షణ, ఉల్లాసం అందిస్తాయి : జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. 8వ వార్డు సభ్యుడు నాతి కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా నాయకుడు జిట్ట నగేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర-జిల్లా కార్యదర్శి కోట రమేష్, మల్లం మహేష్ మరియు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన నిర్వహించగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణను అలవర్చుతాయని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఆదర్శంగా నిలవాలని జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రదర్శించిన 'వీర తెలంగాణ' వీధి నాటకం ఆహూతులను కట్టిపడేసింది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ నాటకం విశేష స్పందన రాబట్టింది.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్ఐ నాయకులు, శాఖ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News