వెంబావి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామం నుండి ఎలికట్టెకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్లకు వైట్ పెయింట్ వేయించి స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. వార్డు సభ్యులు ధనమ్మ, ఓర్స్ అలివేలు, సుజాత, నక్క ఇందిరమ్మ యాదయ్య, ఎన్న నర్సిరెడ్డి, పంగారెక ప్రసాద్, కృష్ణయ్య తదితరులుపాల్గొన్నారు.ప్రత్యేకంగా రాత్రి వేళల్లో వాహనదారులకు స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించేలా ఈ చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని గ్రామస్తులుఅభిప్రాయపడుతున్నారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు.
PRINT TIME: October 09, 2026 03:09 PM
వెంబావి–ఎలికట్టె మార్గంలో రహదారి భద్రతకు కొత్త వెలుగు

15-04-2026
165 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
వెంబావి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామం నుండి ఎలికట్టెకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్లకు వైట్ పెయింట్ వేయించి స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ అలివేలు వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. వార్డు సభ్యులు ధనమ్మ, ఓర్స్ అలివేలు, సుజాత, నక్క ఇందిరమ్మ యాదయ్య, ఎన్న నర్సిరెడ్డి, పంగారెక ప్రసాద్, కృష్ణయ్య తదితరులుపాల్గొన్నారు.ప్రత్యేకంగా రాత్రి వేళల్లో వాహనదారులకు స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించేలా ఈ చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని గ్రామస్తులుఅభిప్రాయపడుతున్నారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి