Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 07:03 PM

వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన జహీరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన జహీరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన జహీరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
March 11, 2026 07:46 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లో ఈరోజు రాజ్యసభ సభ్యునిగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని వారి నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు.రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపించాలని ఆకాంక్షించారు.ప్రజలకు న్యాయం జరిగేలా,సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా ఆయన తన పదవిని వినియోగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు సంపాదించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రియాంక, షబానా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News