Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

12-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లోని ఏకో క్లబ్ ఆధ్వర్యంలో ధండెంపల్లి గ్రామంలోని వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమం నేషనల్ గ్రీన్ కోర్ప్స్సూ చనల మేరకు చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనను వైస్ ప్రిన్సిపాళ్లు Dr. పరంగి రవి , Dr. A. శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణాధికారి Dr. D. మునుస్వామి , విద్యా సమన్వయకర్త Dr. బత్తిని నాగరాజు ప్రారంభించారు.

ఏకో క్లబ్ సమన్వయకర్త వి. శిరీష మాట్లాడుతూ వ్యర్థాలను సరైన విధంగా వర్గీకరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఇంటి వద్దే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అలాగే తగ్గించు–మళ్లీ వాడు–మళ్లీ తయారు చేయు అనే విధానాన్ని పాటించడం ద్వారా వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మార్చుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చి వ్యవసాయం, తోటలలో వినియోగించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్షేత్ర పర్యటన అధికారి సూర్యకిరణ్ , జిల్లా స్వచ్ఛ భారత్ సమన్వయకర్త మొయినుద్దీన్వ్య ర్థాల వర్గీకరణ ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, Dr. P. సిద్దేశ్ గౌడ్ , Dr. D. కృష్ణ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

Article Image

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లోని ఏకో క్లబ్ ఆధ్వర్యంలో ధండెంపల్లి గ్రామంలోని వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమం నేషనల్ గ్రీన్ కోర్ప్స్సూ చనల మేరకు చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనను వైస్ ప్రిన్సిపాళ్లు Dr. పరంగి రవి , Dr. A. శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణాధికారి Dr. D. మునుస్వామి , విద్యా సమన్వయకర్త Dr. బత్తిని నాగరాజు ప్రారంభించారు.

ఏకో క్లబ్ సమన్వయకర్త వి. శిరీష మాట్లాడుతూ వ్యర్థాలను సరైన విధంగా వర్గీకరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఇంటి వద్దే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అలాగే తగ్గించు–మళ్లీ వాడు–మళ్లీ తయారు చేయు అనే విధానాన్ని పాటించడం ద్వారా వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మార్చుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చి వ్యవసాయం, తోటలలో వినియోగించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్షేత్ర పర్యటన అధికారి సూర్యకిరణ్ , జిల్లా స్వచ్ఛ భారత్ సమన్వయకర్త మొయినుద్దీన్వ్య ర్థాల వర్గీకరణ ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, Dr. P. సిద్దేశ్ గౌడ్ , Dr. D. కృష్ణ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News