Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

వ్యక్తిగత శ్రేష్ఠతకు భావోద్వేగ మేధస్సు అవసరం.వరుణ్ అగర్వాల్

11-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ల్గొండ: భావోద్వేగ మేధస్సు పెంపొందించుకుంటే వ్యక్తిగత శ్రేష్ఠత సాధించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అకడమిక్ బ్రాంచ్, భక్తివేదాంత ఇనిస్టిట్యూట్, నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ల ఆధ్వర్యంలో “వ్యక్తిగత శ్రేష్ఠత కోసం భావోద్వేగ మేధస్సు” అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న వరుణ్ అగర్వాల్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్) మాట్లాడుతూ సైన్స్ మరియు ఆధ్యాత్మికత ద్వారా సమతుల్యమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు.

మరో ముఖ్యవక్త కె. వాసుదేవ రావు (అలుమ్నస్, ఐఐటి కాన్పూర్; ప్రెసిడెంట్, భక్తివేదాంత ఇనిస్టిట్యూట్ కోల్‌కతా) మాట్లాడుతూ కోపం, సంతోషం వంటి భావోద్వేగాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ మెరెడ్డి శ్రీనివాసరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా. మునుస్వామి, ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఎన్. కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, కంబాలపల్లి శివరాణి, డా. అదే మల్లేశం, డా. బొజ్జ అనిల్ కుమార్, ఎం. సావిత్రితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యక్తిగత శ్రేష్ఠతకు భావోద్వేగ మేధస్సు అవసరం.వరుణ్ అగర్వాల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News