Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 AM

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు
04-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని వేమనపల్లి మండలంలో వన్యప్రాణి వేట ఘటన వెలుగులోకి వచ్చింది. నీల్వాయి రేంజ్‌కు చెందిన అటవీ అధికారులు మంగళవారం అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

క్యాతనపల్లి గ్రామ శివారులోని పెద్దవాగు రెవెన్యూ భూమిలో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణిని వేటాడినట్లు నిందితులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై నెందుగూరి నారాయణ, గురుంద్ల వసంత్, నిక్కురి బాపు అనే ముగ్గురిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

ఈ దాడుల్లో ఎఫ్‌ఆర్‌ఓ హఫీజుద్ధీన్, డిఆర్‌ఓ ప్రమోద్ కుమార్, ఎఫ్‌బిఓ మహిపాల్‌తో పాటు నీల్వాయి బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు వన్యప్రాణి వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Sthanikam

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News