Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం

13-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వంగపల్లి పీహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం

Article Image

వంగపల్లి పీహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News