Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

30-05-2026 188 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను తెలియజేస్తూ రోడ్డుపై వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినా ఇప్పటి వరకు కేవలం 17 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, ఇంకా సుమారు 50 లారీల ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయి ఉందని వాపోయారు. ఈ క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం పలుమార్లు తడవడంతో నాలుగు సార్లు ఆరబోయాల్సి వచ్చిందని, దీంతో అదనపు ఖర్చులతో పాటు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. లారీలను తగిన సంఖ్యలో పంపడం లేదని, ధాన్యాన్ని అధిక తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తాసిల్దార్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతులు క్యాస వీరాస్వామి, బైరోజు ధనంజయ్య, గుండాల రాంబాబు, సల్ల బిక్షం, మల్లారెడ్డి, అంజయ్య, గుండాల మల్లయ్య, గంగని చింటు, సాయి శేఖర్, నీలా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

Article Image

ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను తెలియజేస్తూ రోడ్డుపై వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినా ఇప్పటి వరకు కేవలం 17 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, ఇంకా సుమారు 50 లారీల ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయి ఉందని వాపోయారు. ఈ క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం పలుమార్లు తడవడంతో నాలుగు సార్లు ఆరబోయాల్సి వచ్చిందని, దీంతో అదనపు ఖర్చులతో పాటు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. లారీలను తగిన సంఖ్యలో పంపడం లేదని, ధాన్యాన్ని అధిక తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తాసిల్దార్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతులు క్యాస వీరాస్వామి, బైరోజు ధనంజయ్య, గుండాల రాంబాబు, సల్ల బిక్షం, మల్లారెడ్డి, అంజయ్య, గుండాల మల్లయ్య, గంగని చింటు, సాయి శేఖర్, నీలా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News