Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 02:23 AM

ఉస్మానియా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు

ఉస్మానియా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు

ఉస్మానియా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు
March 06, 2026 08:31 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మత సామరస్యానికి నిదర్శనంగా కార్యక్రమం

హుజూర్‌నగర్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలోని ఉస్మానియా మసీదులో ముస్లిం యువకులు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత, ఉపవాస దీక్షల ద్వారా మనుషుల్లో సహనం, సేవాభావం, సోదరభావం పెరుగుతాయని అన్నారు. ముస్లిం సోదరులు పాటిస్తున్న ఉపవాసాలు సమాజానికి ఐక్యత, శాంతి, పరస్పర గౌరవం అనే సందేశాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసిమెలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, సహనం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్రమైన నెల అని అన్నారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు సమాజంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి శివరాం యాదవ్, మూడో వార్డు కౌన్సిలర్ సులువ చంద్రశేఖర్, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్ శీలం శీను, ప్రజాప్రతినిధులు సయ్యద్ రఫీ, బాజీ ఉల్లా, షేక్ జానీ పాషా, మ్యారేజ్ బ్యూరో మజీద్, మొహమ్మద్ యాసిన్, అలీ రజాలి, బాబా షఫీ, అజార్, సోహెల్, గౌస్, సలీం, ముఖిద్, ఇమ్రాన్, సమీర్, సైఫ్, అయ్యుబ్, నాగుల్ మీరా, నసీర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు, స్థానిక నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News